ఆంధ్రప్రదేశ్లో పలు రైళ్ల రద్దుపై దక్షిణ మధ్య రైల్వే రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. విజయవాడ సెక్షన్లో సేఫ్టీ నిర్మాణ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసినట్టు ప్రకటించింది. ఈ రద్దులు నేటి (సెప్టెంబర్ 3) నుంచి ఈ నెల 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.
కాగా, విశాఖపట్నం-లింగంపల్లి ట్రైన్ ను ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి-విశాఖపట్నం ట్రైన్ ను ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు. అలాగే, గుంటూరు-రాయగడ ట్రైన్ ను ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు రద్దు చేయగా.. రాయగడ-గుంటూరు ట్రైన్ ను ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు రైల్వే అధికారులు.
ఇక, విజయవాడ-విశాఖపట్నం రైలు అనకాపల్లి వరకు మాత్రమే నడుస్తుందని, విశాఖపట్నం-విజయవాడ రైలు ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అనకాపల్లి నుంచి బయలుదేరుతుంది. అలాగే, మచిలీపట్నం- విశాఖపట్నం ట్రైన్ ను సైతం ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. విశాఖపట్నం-మచిలీపట్నం ట్రైన్ ను ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు. ఇక, తిరుపతి-విశాఖపట్నం రైలు ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సామర్లకోట వరకు మాత్రమే వెళ్తుందని, విశాఖపట్నం-తిరుపతి రైలు ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సామర్లకోట నుంచి బయలుదేరుతుందని తెలిపారు.