Saturday, November 23, 2024

రైల్వే ప్ర‌యానికుల‌కు అల‌ర్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పలు రైళ్ల రద్దుపై దక్షిణ మధ్య రైల్వే రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. విజయవాడ సెక్షన్‌లో సేఫ్టీ నిర్మాణ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసిన‌ట్టు ప్ర‌కటించింది. ఈ రద్దులు నేటి (సెప్టెంబర్ 3) నుంచి ఈ నెల 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.

కాగా, విశాఖపట్నం-లింగంపల్లి ట్రైన్ ను ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి-విశాఖపట్నం ట్రైన్ ను ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు. అలాగే, గుంటూరు-రాయగడ ట్రైన్ ను ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు రద్దు చేయ‌గా.. రాయగడ-గుంటూరు ట్రైన్ ను ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు రైల్వే అధికారులు.

ఇక, విజయవాడ-విశాఖపట్నం రైలు అనకాపల్లి వరకు మాత్రమే నడుస్తుందని, విశాఖపట్నం-విజయవాడ రైలు ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అనకాపల్లి నుంచి బయలుదేరుతుంది. అలాగే, మచిలీపట్నం- విశాఖపట్నం ట్రైన్ ను సైతం ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. విశాఖపట్నం-మచిలీపట్నం ట్రైన్ ను ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు. ఇక‌, తిరుపతి-విశాఖపట్నం రైలు ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సామర్లకోట వరకు మాత్రమే వెళ్తుందని, విశాఖపట్నం-తిరుపతి రైలు ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సామర్లకోట నుంచి బయలుదేరుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement