Saturday, June 29, 2024

TG | హైదరాబాదీలకు అలర్ట్…. త్రాగునీటి సరఫరాకు అంతరాయం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ స్లప స్కీమ్‌ ఫేజ్‌-2 లోని కోదండాపూర్‌ పంప్‌ హౌజ్‌లో రెండో పంపుకు వాల్వ్‌ మరమ్మతులకు గురైందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది.

అదే సమయంలో అటు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే.. యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తారని ప్రకటిచింది. ఈ మరమ్మతుల పనుల కారణంగా జలమండలి ఓ అండ్‌ ఎం డివిజన్లు – 2, 3, 4, 5, 7, 9, 10(ఆ), 10(ఇ), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం, కొన్నిచోట్ల పాక్షిక అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించింది. మరి కొన్నిప్రాంతాల్లో లో ప్రెజర్‌తో నీరు సరఫరా అవుతుంది.

- Advertisement -

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు…

ఎన్‌పీఏ, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్ పూర్, చిలకల గూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, MES, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కా నగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్. కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement