Sunday, November 24, 2024

November Bank holidays | బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌! నవంబర్‌లో బ్యాంకులు పని చేసేది సగం రోజులే.. ఫుల్ డీటేల్స్

అక్టోబ‌ర్ నెల దాదాపు ముగిసినట్టే! మరో రెండు రోజుల్లో అక్టోబర్ నెల ముగిసి.. నవంబర్ నెల ప్రారంభం కానున్నది. ఇక‌, ప్ర‌స్తుతం అన్ని లావాదేవీలు డిజిటల్ అయినప్పటికీ, బ్యాంక్ క‌స్ట‌మ‌ర్లు అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అయితే, నవంబర్ నెలలో బ్యాంకులకు ఆర్బీఐ 15 రోజులు సెలవులు ప్రకటించింది. కాగా, బ్యాంకులకు వెళ్లే రోజు సెలవులు ఉన్నాయా.. లేవా? అన్న సంగతి తెలుసుకుంటే.. బ్యాంకింగ్ లావాదేవీలు, వ్యవహారాలు మ‌రింత‌ ఈజీగా ఏర్పాటు చేసుకోవచ్చు.

బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చిన సెలవుల ప్రకారం 15 రోజులూ సెలవుల్లో.. నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఆరు సెలవులు.. అదనంగా పండుగలు, గెజిటెడ్, బ్యాంక్ సెలవులు, ప్రాంతీయ, రాష్ట్రాల వారీ సెలవులు కలుపుకుని తొమ్మిది రోజులు బ్యాంకులు పని చేయవు. వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులు ఇలా..

- Advertisement -

నవంబర్ 1 : కన్నడ రాజ్యోత్సవం, కుట్, కర్వా చాట్ సందర్భంగా కర్ణాటక, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 10: వంగ్లాలా పండుగ సందర్భంగా అగర్తల, డెహ్రాడూన్, గ్యాంగ్ టక్, ఇంఫాల్, కాన్ఫూర్, లక్నో నగరాల్లో సెలవు.
నవంబర్ 11-14 మధ్య నాలుగు రోజులు వరుసగా బ్యాంకులకు సెలవు.
11న రెండో శనివారం, 12న ఆదివారం వారాంతపు సెలవు.
13, 14 తేదీల్లో నరక చతుర్థి, దీపావళి సందర్భంగా అత్యధిక నగరాల్లో బ్యాంకులకు సెలవు.
బాయ్ దోజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ (దీపావళి/నింగోల్ చాకౌబా/భ్రాత్రిద్వితీయ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో 15న బ్యాంకులకు సెలవు.
20న ఛాత్ పూజ సందర్భంగా బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
23న సెంగ్ కుట్స్ నెమ్, ఈగాస్ బాగ్వాల్ పండుగల సందర్భంగా ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
27న గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రహస్ పౌర్ణమి సందర్భంగా సెలవు.
30న కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో సెలవు
ఈ సెలవు దినాల్లో ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యధాతథం.

వారాంతపు సెలవులు ఇలా
నవంబర్ 5: ఆదివారం
నవంబర్ 11: రెండో శనివారం
నవంబర్ 12: ఆదివారం
నవంబర్ 19 : ఆదివారం
నవంబర్ 25: నాలుగో శనివారం
నవంబర్ 26: ఆదివారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement