Tuesday, November 19, 2024

Alert – ఇజ్రాయెల్, పాల‌స్తీనా మ‌ధ్య యుద్ద మేఘాలు … భార‌తీయులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరిన కేంద్రం

న్యూఢిల్లీ – ఇజ్రాయెల్, పాల‌స్తీనా మ‌ధ్య యుద్ద మేఘాలు క‌మ్ముకోవ‌డంతో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం కోరింది. దీనితో పాటు, స్థానిక అధికారుల భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఇజ్రాయెల్‌కు భారత ప్రభుత్వం సూచించింది. భారత పౌరులు అనవసరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. సాధ్య‌మైనంత వ‌ర‌కు భార‌త పౌరులు ఇళ్ల‌లోనే ఉండాల‌ని కోరింది..

కాగా పాల‌స్తీనాకు చెందిన హ‌మాస్ గ్రూప్ నేడు అయిదువేల రాకెట్ల‌తో ఇజ్రాయేల్ భూభాగంలో విరుచుకుప‌డింది.. ఈ దాడిలో 50 మందికి పైగా మ‌ర‌ణించ‌గా, వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు.. ఈ దాడుల‌కు ప్ర‌తీగా ఇజ్రాయేల్ సైన్యం ప‌త్రిదాడుల‌కు దిగింది.. హ‌మాస్ తీవ్ర‌వాదుల‌ను ఏరివేసిప‌నిలో భాగంగా గాజాలోకి అడుగుపెట్టింది.. దీంతో ఇరుదేశాల మ‌ధ్య యుద్దం తీవ్ర‌రూపం దాల్చ‌నుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement