నటసామ్రాట్ అక్కినేని 99వ జయంతి వేడుకల్లో భాగంగా వంశీ ఇంటర్నేషనల్ సాంస్కృతిక సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా “అక్కినేని కళారత్న స్వర్ణ కంకణం పురస్కారం 2022” ను ప్రముఖ సినీ టీవీ నటుడు లోహిత్ కుమార్ కు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్ర భారతి ప్రధాన వేదిక పై జరిగిన ఈ కార్య్రమానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరకృష్ణ, తెలంగాణ ప్రభుత్వ సలహా దారుడు రమణాచారి, మేజీషియన్ పట్టాభి రామ్,టివీ నేటి యాంకర్ కరుణ,టివీ నటీమణి స్వప్న, బాబి లహరి, మారిషష్ సాంస్కృతి శాఖ నిర్వాహకులు జయ పీసపాటి. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్.ఎం.సి రాజు, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు .ముందుగా వర్ధమాన యువ గాయనీ గాయకుల చే అద్భుతమైన సంగీత విభావరి నిర్వహించారు.
ఈ సందర్భంగా వంశీ రామరాజు మాట్లాడుతూ.. 1972 అందాల నటుడు శోభన్ బాబు చేతుల మీదుగా మాసంస్థ ప్రారంభమైంది. అప్పటి నుండి ఎన్నో వేల సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో సినీ అవార్డుల కార్యక్రమం నిర్వహించ మన్నరు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మా సంస్థ తరుపున నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం ఒక్కో విశిష్ట కళాకారుడికి స్వర్ణ కంకణం ప్రదానం చేస్తూ వచ్చాం. ఆ కోవలో భాగంగా ఈ రోజు సినీ, టివీ నటులు మిమిక్రీ కళా కారుడిగా 35 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందిన సందర్భంగా, అక్కినేని కళారత్న స్వర్ణ కంకణం ప్రదానం చేశారు.ఈ సందర్భంగా వక్తలందరూ లోహిత్ యొక్క వ్యక్తిత్వం తో కొనియాడారు..అందరికీ ఆత్మీయుడు అన్ని రంగాల్లో ఆద్యుడు లోహిత్ కి అక్కినేని నాగేశ్వర రావు పేరుతో ఇస్తున్న ఈ స్వర్ణ కంకణం పొందుతున్న తొలి టివీ కళాకారుడు లోహిత్ కుమార్.