యూపీ సీఎం యోగీపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. యోగీ ఏమైనా కంప్రెస్సరా..? అంటూ ఎద్దేవా చేశారు. ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తామని యోగీ చేసిన వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఓ సీఎం ఈ తరహా మాటలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒంట్లో ఉన్న వేడిని తొలగించేందుకు యోగీ ఏమైనా.. కంప్రెస్సరా..? అంటూ అఖిలేష్ ప్రశ్నించారు. ఆగ్రాలో రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలేష్ మాట్లాడారు. బాబా ముఖ్యమంత్రికి ప్రేమ తెలీదని, ద్వేషం అంటే ఇష్టమని విమర్శించారు. గోరఖ్పూర్ ఓటర్లు యోగీని తిరిగి మఠానికి పంపిస్తారని ఎద్దేవా చేశారు.
ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన యోగీ.. మళ్లి అక్కడికే వెళ్లాల్సి ఉంటుందన్నారు. యోగీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ.. ఎన్నికల కమిషన్కు తాను లేఖ రాసినట్టు అఖిలేష్ తెలిపారు. సీఎం ఈ స్థాయికి దిగజారడటం సరికాదన్నారు. యోగీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్ విషయమై కూడా విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ అమృతమని బీజేపీ చెబుతోందని, అయితే గత బడ్జెట్లు విషపూరితమైనవా..? అని అఖిలేష్ ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,