సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌కు కొత్త తలనొప్పి ప్రారంభమైంది. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అఖిలేష్ యాదవ్‌తో అప్నా దళ్ (కే) నేతలు చర్చలు జరుపుతు న్నారు. తాము కోరుకున్నట్టు సీట్లు కేటాయించని పక్షంలో అఖిలేష్ కూటమి నుంచి బయటికి వస్తామని అప్నాదళ్ (కే) నేతలు తెగేసి చెబుతున్నారు. అను ప్రియా పటేల్ ఎన్డీఏతో ఉండగా.. ఆమె తల్లి క్రిష్ణ పటేల్, సోదరి పల్లవి పటేల్ అఖిలేష్ యాదవ్‌తో పొత్తు ఉంది. ఫిబ్రవరి 10 నుంచి యూపీలో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా అప్నా దళ్(కే), సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకాలు పూర్తికాలేదు. ఇరు పార్టీల మధ్య విభేదాలు కొనసా గుతూనే ఉన్నాయి.
అనుప్రియ పటేల్ సోదరి పల్లవీ పటేల్ సీట్ల సర్దుబాటు చర్చల్లో కీలకంగా వ్యవహరి స్తున్నారు. అఖిలేష్‌తో చర్చలు జరిపేందుకు శుక్రవారం ఉదయమే.. లక్నో చేరుకున్నారు. అఖిలేష్‌తో కలిసి ముందుకు వెళ్లాలా..? వద్దా..? అనేది ఆమె నిర్ణయించ నున్నారు. పల్లవీ పటేల్.. సిరాతు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తర ఫున డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బరిలో ఉన్నారు. ఈ విషయంలో స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నేతల ను ఆగ్రహానికి గురి చేసింది.
తన సొంత పార్టీ నుంచి పోటీ చేయాలా? సమాజ్‌వాదీ పార్టీ గుర్తుతో పోటీ చేయాలా? అన్నదానిపై ఇంకా పల్లవీ పటేల్‌కు స్పష్టత కరువైంది. ఈ విషయమై ఆమె అఖిలేష్ యా దవ్‌పై కొంత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. సమా జ్‌వాదీ పార్టీతో పొత్తులో భాగంగా.. అప్నాదళ్ (కే) 18 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. అయితే అఖిలేష్ పార్టీ మాత్రం కేవలం 8 స్థానాలు ఇస్తామని చెబుతున్నది. దీనిపై ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. వీరిద్దరి మధ్య రచ్చ.. బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..