Friday, November 22, 2024

అఖిలేష్‌, ఆజంఖాన్‌.. ఎంపీ పదవులకు రాజీనామా

•ఎమ్మెల్యేలుగా సేవలకు సై
•స్పీకర్‌ ఓం బిర్లాకు అఖిలేష్‌ రాజీనామా లేఖ
•ప్రతిపక్ష నాయకుడిగా ఎస్‌పీ చీఫ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికల్లో కర్హాల్‌ సీటు నుంచి గెలిచిన అఖిలేష్‌ యాదవ్‌.. ఎమ్మెల్యే పదవిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో యూపీ అసెంబ్లిలో పని చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మొన్నటి అసెంబ్లి ఎన్నికల్లో గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌.. తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఆజంఘడ్‌ లోక్‌సభ అసెంబ్లిd స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నిబంధనల మేరకు ఏదో ఒక పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఆ మేరకు తన ఎంపీ పదవిని ఆయన వదులుకున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి అఖిలేష్‌ యాదవ్‌ రాజీనామా లేఖను సమర్పించారు.
రాంపూర్‌ నుంచి ఖాన్‌ గెలుపు జైల్లో ఉన్న మరో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆజంఖాన్‌ అసెంబ్లి ఎన్నికల్లో రాంపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. ఎంపీ పదవికి రాజీనామా చేశారు..

అఖిలేష్‌ యాదవ్‌, ఆజంఖాన్‌ రాజీనామాతో వారు ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాల్లో మరో ఆరు మాసాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొనే అవకాశం ఉంటుంది. మొన్నిట అసెంబ్లి ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో అధికార బీజేపీ 255 స్థానాల్లో విజయం సాధించింది. వరుసగా రెండో సారి అధికార పగ్గాలు సొంతం చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాల్లో గెలిచింది. 2017 యూపీ ఎన్నికలతో పోలిస్తే.. ఎస్‌పీ 645 స్థానాలు అదనంగా గెలుచుకుంది. దీంతో ప్రస్తుతానికి జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటూ.. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు అఖిలేష్‌ యాదవ్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement