తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ఫేక్ నోటీసులు జారీ అయ్యాయి. ఫేక్ నోటీసులు పంపి అరెస్ట్ చేస్తామని కొందరు దుండగులు బెదిరించారు. అంతేకాకుండా అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన మంత్రి గంగుల.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఈడీ అధికారులు చెప్పడంతో గంగుల షాక్ తిన్నారు.
ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకున్న మంత్రి గంగుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ పేరుతో సైబర్ నేరగాళ్లు మంత్రికే నోటీసులు ఇవ్వడాన్ని ఈడీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఈడీ అధికారులు ఆదేశించారు. కాగా మరోవైపు ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌కు సంబంధించిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల