Friday, November 22, 2024

అకాశ ఎయిర్‌ భారీ ఆర్డర్‌.. అంతర్జాతీయ రూట్స్‌పై దృష్టి

మన దేశానికి చెందిన మరో ముఖ్యమైన ఎయిర్‌లైన్‌ సంస్థ అకాశ ఎయిర్‌ కూడా భారీగా కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. స్టార్టప్‌ బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌గా ప్రారంభమైన ఆకాశ్‌ ఎయిర్‌ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త విమానాలను
సమీకరించనుంది. ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌ 17 బోయింగ్‌ విమానాలను లీజ్‌ ప్రాతిపదికన నడుపుతోంది. ఆకాశ ఎయిర్‌ ఏర్పడి 200 రోజులైంది. సంస్థ ప్రస్తుతం 72 జెట్‌ విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. ఈ విమానాలు 2027 మార్చి నాటికి రానున్నాయి. ఈ సంవత్సరం చివరిలో ఆకాశ ఎయిర్‌ మరో భారీ ఆర్డర్‌ ఇవ్వనుందని ఆకాశ ఎయిర్‌ సహా వ్యవస్థాపకుడు వినయ్‌ దూబే చెప్పారు.

- Advertisement -

నారో బాడీ విమానాలకు సంస్థ ఆర్డర్‌ ఇచ్చిందని తెలిపారు. అంతర్జాతీయ రూట్స్‌పై ప్రధానంగా సంస్థ దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. దీంతో పాటు దేశీయంగా కనెక్టివిటీని పెంచుతామన్నారు. ఆకాశ ఎయిర్‌లో రెండు నెలల్లో మూడు కొత్త విమానాలు చేరనున్నాయి. దీంతో విమానాల సంఖ్య 20కి చేరనుంది. 20 సర్వీస్‌లు ఉంటే నిబంధనల ప్రకారం అంతర్జాతీయ సర్వీస్‌లు నడిపేందుకు ఆకాశకు అవకాశం వస్తుంది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యంలో ప్రాంతాలకు 737 మ్యాక్స్‌ విమానాలను నడిపించాలని ఆకాశ భావిస్తోంది.

కోవిడ్‌ తర వాత పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు కొత్త విమానాలను ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌కు చెందిన పలు విమానయాన సంస్థలు 1500 నుంచి 1700 విమానాల వరకు ఆర్డర్‌ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. దేశీయ విమానయాన రంగంలోఅగ్రస్థానంలో ఉన్న ఇండిగో త్వరలోనే మరో 500విమానాలకు ఆర్డర్‌ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement