Saturday, November 23, 2024

టేకాఫ్‌కు ఆకాశ ఎయిర్‌లైన్స్‌, విమానం ఫొటో పోస్టు చేసిన సంస్థ.. జూన్‌ నుంచే ప్రారంభం..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌ బుల్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా.. విమాన రంగంలోకి అడుగుపెట్టారు. తన విమానయాన సంస్థ పేరును ఆకాశగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్‌ లైన్స్‌ విమానాలు త్వరలో టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. కమర్షియల్‌ సేవలను అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. తక్కువ ఖర్చుకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. అయితే సేవలను అందించేందుకు వినియోగించే విమానాలకు సంబంధించిన ఎంపిక చేసిన విమాన ఫొటోను కంపెనీ ఈ రోజు షేర్‌ చేసింది. శాంతంగా ఉండలేకపోతున్నాను.. మా క్యూపీ-పైకి హలో చెప్పండి అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. విమాన సేవలు ప్రారంభించేందుకు రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా.. రూ.262 కోట్లను పెట్టుబడిగా పెట్టారు.

గతేడాదే లోగో లాంచ్..

తమ విమానయాన కంపెనీకి సంబంధించిన లోగోను గతేడాదే లాంచ్‌ చేసింది. ఎయిర్‌లైన్‌ తన లోగో కోసం సన్‌రైజ్‌ ఆరెంజ్‌ అండ్‌ పాషనేట్‌ పర్సుల్‌ రంగులను ఎంచుకుంది. మెట్రో నగరాల నుంచి టైర్‌-2, టైర్‌-3 నగరాల మధ్యే సేవలు ఆరంభం అవుతున్నాయి. ముందుగా 12 నెలల్లో 18 విమనాలతో తన సేవలు ప్రారంభించనుంది. ఆ తరువా కంపెనీ ప్రతీ సంవత్సరం 12 నుంచి 14 కొత్త విమానాలను చేరుస్తూ.. దేశ వ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధం అవుతున్నది. ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు గతేడాదే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కమర్షియల్‌ విమానాలు కూడా నడిపించుకునేందుకు అనుమతులు ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement