Tuesday, October 8, 2024

వెల్లే గోరింక.. చాల్లే చాలింక..

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న సినిమా ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి రాంబాబు యాదవ్‌ సమర్పణలో రూపొందుతోంది. కేఎస్ శంకర్‌ రావు, ఆర్‌ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగాహీరో ఆకాష్‌ పూరీ ‘మధురపూడి గ్రామం అనే నేనుస‌ సినిమా ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌” వెల్లే గోరింక..స‌స‌ను రిలీజ్ చేశారు. అనంతరం పాట బాగుందంటూ హీరో శివ కంఠమనేని, చిత్ర బృందాన్ని అభినందించారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా.. ధనుంజయ్‌, సాహితీ పాడారు.

” వెల్లే గోరింక.. ” పాట ఎలా ఉందో చూస్తే.. వెల్లే గోరింక మళ్లి రావే నా వంక.. నన్నే నేను మరిసిపోయా నిన్నే చూశాక.. చాల్లే చాలింక ఈ అల్లరి ఎందాకా.. పోతా ఉంటే రారా అంటూ గోలే చేయమాక.. పట్టుకో పోనీక కట్టుకో కొంగెనక.. రైకలో దాచేయవే గుండెనే పారేయక..”’ అంటూ రొమాంటిక్‌ గా సాగుతుందీ పాట. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement