Tuesday, November 26, 2024

జియో వర్సెస్‌ ఎయిర్‌టెల్‌.. అన్ని రంగాల్లోనూ పోటీ

టెలికాం రంగంలో జియోకు ఎయిర్‌టెల్‌ పోటీకి నిలుస్తున్నది. సముద్ర మార్గాన ఇతర దేశాలకు సేవలు అందించేందుకు జియోతో ఎయిర్‌టెల్‌ పోటీకి సిద్ధం అవుతున్నది. ఇతర ప్రధాన ఇంటర్నెట్‌ హబ్‌లతో అనుసంధానం చేస్తూ జియో సముద్ర మార్గానా ఇంటర్నెట్‌ కేబుల్‌ నిర్మాణలను జియో చేపడుతున్నది. ఇదే బాటలో ఎయిర్‌టెల్‌ ప్రయాణించేందుకు నిర్ణయించింది. త్వరలో మాల్దివుల్లోని హుల్‌ హుమలే ప్రాంతం వరకు తమ సేవలను అనుసంధానించేందుకు జియో సిద్ధమైంది. సముద్ర మార్గాన ఇతర దేశాలతో అనుసంధానించే విషయపై.. ఎయిర్‌టెల్‌ కీలక ప్రకటన చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు సేవలు అందించే తన హైస్పీడ్‌ గ్లోబల్‌ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా సీ-ఎంఈ-డబ్ల్యూ-6 అండర్‌ సీ కేబుల్‌ కన్సార్టియంలో చేరినట్టు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది.

సీ-ఎంఈ-డబ్ల్యూఈ-6లో పెట్టుబడులు..

సీ-ఎంఈ-డబ్ల్యూఈ-6లో ప్రధాన పెట్టుబడిదారుగా పాల్గొంటున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ అండర్‌ సీ కేబుల్‌ వ్యవస్థ నిర్మాణానికి కావాల్సిన మొత్తం పెట్టుబడిలో 20 శాతం పెట్టుబడులు పెట్టనున్నట్టు వివరించింది. సీ-ఎంఈ-డబ్ల్యూఈ-6లోని మరో 12 కన్సార్టియం సభ్యుల్లో బంగ్లాదేశ్‌ సబ్‌ మెరైన్‌ కేబుల్‌ కంపెనీ, ధియాగు (మాల్దివులు), జిబౌటీ టెలికామ్‌, మొబిల (సౌదీ అరేబియా), ఆరెంజ్‌ (ఫ్రాన్స్‌), సింగ్‌ టెల్‌ (సింగపూర్‌), శ్రీలంక టెలికామ్‌, టెలికామ్‌ ఈజిప్టు, టెలికోమ్‌ మలేషియా, టెలిన్‌ (ఇండోనేషియా) ఉన్నాయి. సీ-ఎంఈ-డబ్ల్యూఈ-6 ప్రాజెక్టులో భాగంగా ఫ్రాన్స్‌ నుంచి అన్నీ దేశాలను కలుపుతూ సింగపూర్‌ వరకు అండర్‌ సీ కేబుల్‌ నిర్మాణం చేపడుతారు. దీని పొడవు 19,200 కిలోమీటర్లు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సముద్ర గర్భ కేబుల్‌ వ్యవస్థలో ఇది ఒకటిగా నిలవనుంది. సీ-ఎంఈ-డబ్ల్యూఈ-6తో ఎయిర్‌టెల్‌ గ్లోబల్‌ నెట్‌వర్క్‌కు అదనంగా 100 టీబీపీఎస్‌ సామర్థ్యం సమకూరనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎయిర్‌టెల్‌ ఇతర భాగస్వాములతో కలిసి సింగపూర్‌ – చెన్నై – ముంబై మధ్య నాలుగు ఫైబర్‌ పెయిర్‌ నిర్మించనుంది. ఏది ఏమైనా.. జియోకు ధీటుగా దేశీయంగా, విదేశాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్‌ అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నట్టు స్పష్టం అవుతున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement