Saturday, November 23, 2024

పెరిగిన విమాన ప్రయాణాలు

కరోనా దెబ్బకు దేశమంతటా విమాన ప్రయణాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో విదేశీ ప్రయాణాలు కూడా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా విమానాలు తిరిగి రన్‌వేలు ఎక్కుతున్నాయి. తాజాగా విజయవాడ విమానాశ్రయం కూడా ప్రారంభమైంది. దీంతో క్రమంగా విజయవాడలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఈ నెల ప్రారంభం నుంచి అధిక సంఖ్యలో ప్రయాణికుల తాకిడి పెరిగింది. కోవిడ్‌కు ముందు ఈ ఎయిర్‌పోర్టు నుంచి నెలలో 75 వేల నుంచి 90 వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు జరిపేవారు.

కోవిడ్‌ రెండో దశ తీవ్ర రూపం దాల్చిన ఏప్రిల్‌ నెలలో 44,214 మంది ప్రయాణించగా, మే నెలలో ఆ సంఖ్య 16,381కి పడిపోయింది. అయితే జూన్‌ మొదటి నుంచి పరిస్థితులు మారాయి. రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సగటున రోజుకు 600 మంది విజయవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌లకు ఎక్కువగా వెళ్తున్నారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 10 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు వందే భారత్‌ మిషన్‌ కింద మస్కట్, దుబాయ్, సింగపూర్, కువైట్‌ల నుంచి అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement