Friday, November 22, 2024

ఎయిర్ లైన్ ‘ఆకాశ’.. 73 బోయింగ్ ప్లేన్స్ ఆర్డర్

ప్ర‌భ‌న్యూస్ : స్టార్టప్‌ ఎయిర్‌లైన్‌ ఆకాశ ఎయిర్‌కు మరో ముందడుగు పడింది. భారత్‌ బిలియనీర్‌, స్టాక్‌ బిగ్‌ బుల్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా.. ఆకాశ ఎయిర్‌పై మంగళవారం కీలక ప్రకటన చేశారు. 72 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను ఆర్డర్‌ చేసినట్టు వివరించారు. ఆకాశ ఎయిర్‌ బ్రాండ్‌ కింద ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థను ఇప్పటికే ఏర్పాటు చేసింది. బోయింగ్‌ విమానాల కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పంద విలువ దాదాపు 9 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.66వేల కోట్లు) అని ఝున్‌ఝున్‌ వాలా వివరించారు.

ఈ సందర్భంగా ఆకాశ ఎయిర్‌ సీఈఓ వినయ్‌ దూబే మాట్లాడుతూ.. కంపెనీ తన మొదటి విమానాల ఆర్డర్‌ కోసం బోయింగ్‌ సంస్థతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని వివరించారు. ఈ కొత్త 737 మ్యాక్స్‌ విమానం కేవలం విమానయాన ఖర్చులను మాత్రమే తగ్గించకుండా తక్కువ ధరకు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తూ.. పర్యావరణ హితమైన సంస్థగా నడపాలనే తమ లక్ష్యానికి మద్దతు ఇస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు.

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్స్‌లో భారత్‌ ఒకటన్నా రు. భారత్‌ అభివృద్ధికి సంబంధించిన శక్తిని అందించడమే ఆకాశ ఎయిర్‌ లక్ష్యం అని దూబే తెలిపారు. దీంతో పాటు సామాజిక-ఆర్థిక లేదా సాంస్కృతిక నేపథ్యాలతో సంబంధం లేకుండా భారతీయులందరికీ సమ్మిళిత వాతావరణంలో ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందించడం అని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement