Saturday, November 23, 2024

విమానయానం మరింత భారం

విమానయానం మరింత భారం అవనుంది. దేశీయ టికెట్ ధరల పరిధిని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కనీస ధర పరిమితిని ఐదు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలపరిధి ఏప్రిల్ చివరి వరకు అమల్లో ఉంటాయి. కాగా నెలవ్యవధిలోనే దేశీయ విమానటికెట్ ధరలను పెంచడం ఇది రెండోసారి. విమాన ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో టికెట్ ధరల పెంపునకు కేంద్ర ప్ర
భుత్వం సడలింపునిచ్చింది. మరోవైపు ఏప్రిల్ చివరి
వరకు దేశీయ ఎయిర్లైన్స్ సామర్ధ్యంపై 80 శాతం పరిమితిని విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చిలో దేశీయ విమానయానం స్వల్పంగా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విమాన ఇంధన ధరలు పెరిగిన
నేపథ్యంలో టికెట్ ధరలు 5 శాతం మేర పెంపునకు అవకాశం ఇచ్చాము. అయితే టికెట్ ధర గరిష్ట పరిమితిలో ఈసారి ఎలాంటి మార్పులు చేయలేదని విమానయాన మంత్రిత్వశాఖకు
చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

విమానయాన శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. అవసరాన్ని నిర్ణయం తీసుకుంటున్నామని అధికారి వివరించారు. కాగా విమాన టికెట్ ధరల పెంపును విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. విమాన ఇంధన ధరలు నిరంతరంగా పెరుగుతున్న నేపథ్యంలో కనిష్ఠ ధరల పరిధిని 5 శాతం మేర పెంచామని ఆయన వెల్లడించారు. నెలలో మూడు సార్లు రోజువారి ప్రయాణికుల సంఖ్య 3.5 లక్షలు దాటితే విమానయాన రంగంలో 100 శాతం కార్యకలాపాలకు అవకాశమిస్తామని ఆయన వెల్లడించారు. వేర్వేరు రాష్ట్రాల్లో విమాన ప్రయాణానికి తప్పనిసరి ఆ టీ-పీసీఆర్ టెస్ట్ నిబంధనలతోపాటు ఇతర నిబంధనల కారణంగా మార్చిలో విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గినట్టుగా కనిపిస్తోందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement