మన దేశంలో దేశీయ, అంతర్జాతీయ విమాన ట్రాఫిక్ 2023-24 ఆర్ధిక సంవత్సరంలో పెరగనుంది. మన దేశ విమానయాన సంస్థలు 132 విమానాలకు కొత్తగా తమ ప్లీట్‌లో చేర్చనున్నాయని ఒక నివేదిక వెల్లడించింది. రూపాయి బలహీనపడటం, ఇంధన ధరలు పెరుగుతున్నందున ఇండియాకు చెందిన ఎయిర్‌లైన్స్ 1.6 నుంచి 1.8 బిలియన్ డాలర్ల మేర నష్టపోనున్నాయని పేర్కొంది. కొత్త విమానాలను జోడించే విషయంలో టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ 53, ఇండిగో 49 విమానాలను సమకూర్చుకోనున్నాయి. ప్రస్తుతం ఇండియాలో అన్ని విమానయాన సంస్థల వద్ద 2023 మార్చి నాటికి 684 విమానాలు ఉన్నాయి. ఈ సంఖ్య 2024 మార్చి నాటికి 816కు పెరగనుంది.
దేశీయ ట్రాఫిక్ వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరగనుంది. ఆ నివేదిక వెల్లడి ంచింది. ఇది 2023-24 ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య 160 మిలియన్లకు చేరుకోనుంది. ఇంటర్నేషనల్ ట్రాఫిక్ 22 నుంచి 27 శాతం పెరిగి 72-75 మిలియన్లకు చేరుకుంటుందని సీఏపీఏ ఇండియా సంస్థ అంచనా వేసింది. ఇండియా నుంచి లోకాస్ట్ ఎయిర్‌లైన్స్ ఎక్కువ ప్రాంతాలకు సర్వీస్‌లను నడపనున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం దేశీయ ట్రాఫిక్ 2022లో 47.5 శాతం పెరిగి 123.2 మిలియన్లకు చేరుకుంది. రానున్న ఆర్ధిక సంవత్సరంలో విమాన ఇంధనం ధర పెరగడం వల్ల ఎయిర్‌లైన్స్ నష్టపోతాయని నివేదిక పేర్కొంది.