Friday, November 22, 2024

రికార్డ్‌ స్థాయిలో విమాన ప్రయాణికులు

దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 30న రికార్డ్‌ స్థాయిలో విమానల ప్రయాణికులు నమోదయ్యారు. ఆది వారం ఒక్క రోజు మొత్తం 4,56,082 మంది ప్రయాణికులు, 2,978 విమానాల్లో ప్రయాణించారని పౌరవిమానయాన సంస్థ సోమవారం నాడు ట్విటర్‌లో తెలిపింది. ఒక్క రోజులో ఇంత మంది ప్రయాణించడం పెరిగిన దేశ ఆర్ధిక వ్యవస్థకకు ప్రతీక అని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 30 దేశీయ విమాన ప్రయాణికులు రికార్డ్‌ స్థాయిలో నమోదైనట్లు ఆయన తెలిపారు.

కోవిడ్‌ కంటే ముందు ఒక్క రోజులో ప్రయాణించిన వారి సంఖ్య 3,98,579గా ఉంది. దేశ పౌర విమానయాన రంగం ప్రతి రోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం మార్చిలో 128.93 లక్షల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. అంతకు ముందు సంవత్సరం మార్చితో పోల్చితే ఇది 21.4 శాతం ఎక్కువ. 2023 జనవరి నుంచి మార్చి వరకు దేవీయ ప్రయాణికుల సంఖ్య 375.04 లక్షలుగా నమోదైనట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement