Sunday, November 24, 2024

150 బోయింగ్‌ విమానాలు కొననున్న ఎయిర్‌ ఇండియా.. డీల్‌పై సంతకాలు

ఎయిర్‌ ఇండియా కొత్తగా 150 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ జెట్‌ విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు బోయింగ్‌తో ఈ డీల్‌పై సంతకాలు పూర్తి చేసింది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిర్‌ ఇండియా తొలుత 50 బోయింగ్‌ విమనాలను కొనుగోలు చేయనుంది. దశలవారికి ఈ 150 బోయింగ్‌ విమానాలను తీసుకోనుంది. ఎయిర్‌ ఇండియా జులైలోనే ఈ ఒప్పందంపై చర్చలు జరిపింది. విమానయాన రంగంలో పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా విమానాల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలని ఎయిర్‌ ఇండియా భావిస్తోంది. గతంలోనూ బోయింగ్‌, ఎయిర్‌ బసు సంస్థలతో ఎయిర్‌ ఇండియా సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా, బోయింగ్‌ మధ్య విమానాల కొనుగోలుకు జరిగిన ఒప్పందం విలువ 50 మిలియన్‌ డాలర్లు.

2021లో అక్షర ఎయిర్‌లైనర్‌ బోయింగ్‌ కంపెనీకి అతి పెద్ద ఆర్డర్‌ ఇచ్చింది. ఈ సంస్థ 72 మ్యాక్స్‌ 737 జెట్‌ విమానాల కొనుగోలుకు బోయింగ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ 9 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం మన దేశ విమానయాన రంగంలో తక్కువ ఖర్చుతో కూడిన సంస్థలు ఎక్కువ మార్కెట్‌ వాటా కలిగి ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఇండిగో, స్పైస్‌ జెట్‌, ఎయిర్‌ ఏషియా ఇండియా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ ఎయిర్‌ బసుకు చెందిన చిన్న విమానాలను నడుపుతున్నాయి. వీటిలో తక్కువ ఛార్జీలతో ఎకానమి సర్వీస్‌లను నడుపుతున్నాయి. స్పైస్‌ జెట్‌ వద్ద అత్యధికంగా బోయింగ్‌కు చెందిన 155 మ్యాక్స్‌ విమానాలు ఉన్నాయి.

రానున్న కాలంలో మన దేశ విదేశీ విమానయాన రంగంలో పోటీ తీవ్ర రూపం దాల్చనుంది. ఈ పోటీలో ఎక్కువ వాటాను సాధించేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయి. దీనిలో భాగంగానే ఎయిర్‌ ఇండియా ఎక్కువ విమానాలను కొనుగోలు చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement