Friday, November 22, 2024

Air Crash – కుప్ప‌కూలిన విమానం – మ‌లావి దేశ ఉపాధ్య‌క్షుడితో స‌హా 10మంది దుర్మ‌ర‌ణం

తూర్పు ఆఫ్రికాలోని మలావి ఓ విమానం కుప్ప కూలింది. మలావి రక్షణ శాఖకు చెందిన ఈ విమానంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమా తో పాటు మరో తొమ్మిది మంది కూడా దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.. ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9.17 గంటలకు షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోవాల్సి వుంది. ఆ విమానం ఉదం 10.02 గంటల వరకు కూడా ల్యాండింగ్ కాలేదు. పైగా, రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం అదృశ్యమైనట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. రాజధాని నగరం లిలాంగ్వే నుంచి బయలుదేరిన ఈ విమానం రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంటాక్టు కోసం ఏవియేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని మలావి అధ్యక్ష, కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించాయి.

కాగా, విమానం కోసం అన్వేషణ కొనసాగించిన‌ సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ బృందాలు నేటి ఉద‌యం విమాన శిధిలాల‌ను క‌నుగొన్నారు.. ఈ ప్ర‌మాదంలో విమానంలో ప్ర‌యాణించిన దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమా , చిలిమా భార్య మేరీ, యునైటెడ్ ట్రాన్స్ ఫర్మేషన్ మూవ్మెంట్ (యూటీఎం) పార్టీకి చెందిన అయిదుగురు, మరో ముగ్గురు అధికారులు మ‌రణించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement