Saturday, September 21, 2024

TG | తెలంగాణకు ఐదు రోజులపాటు వర్ష సూచన..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న అయిదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటకను ఆనుకొని తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది.

ఉపరితల ఆవర్తనంపై నుంచి ద్రోణి ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక, తెలంగాణను ఆనుకొని ఉన్న ఆగ్నేయ ఆరేబియా సముద్రం మీదుగా కేరళగుండా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు విస్తరించి ఉందని వివరించింది.

దీని ప్రభావంతో సోమవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement