మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. దేశ జనాభాలో అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ రాబోయే నెలల్లో మనం జనసమ్మర్ధ ప్రాంతాల్లోకి వెళ్లకుండా, ప్రమాణాలకు దూరంగా ఉండటం వంటి నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం థర్డ్ వేవ్ తలెత్తకుండా జాప్యం చేయడంతో పాటు థర్డ్ వేవ్ వస్తే దాన్ని తీవ్రతరం కాకుండా పరిమితం చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇక వైరస్ స్వభావం ఎలా మారుతుందనేది మనం అంచనా వేయలేమని..అయితే రాబోయే నెలల్లో అది అనూహ్యంగా పరివర్తన చెందేలా కనిపించడం లేదని సానుకూలంగా స్పందించారు.
ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన తాజా సెరో సర్వేలో ఆరేండ్లు పైబడిన జనాభాలో 67.6 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు తయారయ్యాయని వెల్లడైనట్లు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదనే అంచనాల నేపథ్యంలో దేశ జనాభాలో అత్యధికులకు మెరుగైన రీతిలో రోగనిరోధక శక్తి ఉందని సెరోసర్వేను ఉటంకిస్తూ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : మరింత హాట్ గా అను ఇమ్మానుయేల్