Friday, November 22, 2024

సిరీస్‌ లక్ష్యంగా.. రేపు కివీస్‌తో చివరి వన్డే

సిరీస్‌ డిసైడర్‌ అయిన మూడో టీ 20 రేపు (బుధవారం) అహ్మదాబాద్‌లో జరగనుంది. శ్రీలంక, న్యూజిలాండ్‌పై వన్డేల్లో దుమ్మురేపిన గిల్‌ టీ 20ల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. దాంతో ఇషాన్‌కు జోడిగా పృథ్వీ షాను తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. టైటిల్‌ పోరులో పై చేయి ఎవరు సాధిస్తారో నరేంద్ర మోడీ స్టేడియంలో తేలిపోనుంది. అయితే ఓపెనర్లు శుభమన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ ఆందోళన కలిగిస్తోంది. వీరిద్దరూ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యారు. దాంతో ఇండోర్‌ లక్నోలో జరిగిన మ్యాచుల్లో కివీస్‌ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో గిల్‌, ఇషాన్‌ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు శుభారంభం ఇవ్వకపోవడంతో మిడిల్‌ ఆర్డర్‌పై ఒత్తిడి పడుతోంది.

రంజీల్లో అస్సాంపై ట్రిపుల్‌ సెంచరీ (379) బాదిన ముంబై ఓపెనర్‌ పృథ్వీ షా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీలో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన అతడిని మూడేళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపిక చేశారు. దాంతో జాతీయ జట్టు తరపున అతను పరుగుల వరద పారిస్తాడని అంతా అనుకున్నారు. అయితే తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న గిల్‌ వైపే కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ హార్థిక్‌ పాండ్యా మొగ్గు చూపడమే అందుకు కారణం. కానీ గిల్‌ రెండు మ్యాచుల్లో 18 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇషాన్‌ కూడా 23 పరుగులకు పరిమితం అయ్యాడు. దాంతో ఇషాన్‌ ప్లేస్‌లో వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ జితేష్‌ శర్మకు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. సిరీస్‌ డిసైడర్‌ అయిన మూడో టీ 20 టీమిండియా, కివీస్‌ మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది.

ఆదివారం లక్నోలో జరిగిన కీలకమైన రెండో టీ 20 భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ సమం చేసింది. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అహ్మదాబాద్‌ చేరుకుని కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. ” నేను రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన టీ 20 వన్డేలో ఇదే స్టేడియంలో అరగేట్రం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాను. నేను ఇక్కడి నుంచే ప్రారంభించాను. తిరిగి అదే చోటికే వచ్చాను” అని సూర్యకుమార్‌ అన్నారు. చివరి 12 ద్వైపాక్షిక టీ 20 వన్‌డే హోమ్‌ సిరీస్‌లో అజేయంగా నిలిచిన భారత దేశం యొక్క గర్వించదగ్గ రికార్డు బుధవారం తేలిపోనుంది. ఇషాన్‌ కిషన్‌, శుభమన్‌ గిల్‌,రాహుల్‌ త్రిపాఠీటాప్‌ ఆర్డర్‌ బ్యాటర్ల ఫామ్‌పై ఆతిథ్య జట్టు ఆందోళన చెందుతుంది. మూడో టీ 20 రాత్రి ఏడుగంటలకు ప్రారంభం కానుంది.

- Advertisement -

భారత జట్టు..

హార్థిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (వైస్‌ కెప్టెన్‌) ఇషాన్‌ కిషన్‌ , శుభమన్‌ గిల్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠీ, జితేష్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దిdప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌ , ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్‌ మావి, పృథ్వీషా.

న్యూజిలాడ్‌ జట్టు..

మిచెల్‌ సాంటర్న్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, మైఖేల్‌ , బ్రేస్‌ వెల్‌, మార్క్‌ చాప్‌ మన్‌, డేన్‌ క్లీవర్‌, డెవన్‌ కాన్వే, జాకబ్‌ డఫీ, లాకీ ఫెర్గూసన్‌, బెన్‌ లిస్టర్‌, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మైఖేల్‌ రిప్పన్‌, హెన్రీ షిప్లీ, ఇష్‌ సోధి, బ్లెయిర్‌ టిక్నర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement