Monday, November 25, 2024

2026 నాటికి భారత్‌లో డేంజ‌ర్ బెల్స్‌.. ఏడాదికి 20 లక్షల కేన్సర్‌ కేసులుంటాయ‌న్న‌ ఎయిమ్స్‌

రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో క్యాన్సర్‌ కేసులు భారీగా పెరుగుతాయని భారత్‌ వైద్య పరిశోధన మండటి(ఐసీఎంఆర్‌) అందించిన డేటా ఆధారంగా ఎయిమ్స్‌ అంచనా వేసింది. 2026 నాటికి సంవత్సరానికి భారత్‌లో 20 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. ఢిల్లిలోని ఎయిమ్స్‌లోని సర్జికల్‌ ఆంకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌వీఎస్‌ డియో మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతోందని, ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ప్రతి ఏటా 13-14 లక్షల మంది ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారని, 2026 నాటికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 4న జరుపుకుంటున్న ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం థీమ్‌ అంతరాన్ని మూసివేయడం (క్లోజ్‌ ద గ్యాప్‌) అని డాక్టర్‌ డియో పేర్కొన్నారు.

- Advertisement -

క్యాన్సర్‌కు సంబంధించిన అపోహలపై అవగాహన లేకపోవడం, వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ థీమ్‌ను ఎంచుకున్నామని ఆయన వివరించారు. క్యాన్సర్‌ నయం కాదనే అపోహా ప్రజలకు పూర్తిగా సందేహాస్పదమని డాక్టర్‌ అన్నారు. సకాలంలో వ్యాధిని గుర్తిస్తే వ్యాధి నయం అవుతుందని, అందుకే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రచారానికి సంబంధించిన వివరాలను ఆయన వివరిస్తూ.. అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను ప్లాన్‌ చేశామని, వైద్యులు ప్రజలతో మమేకమవుతారని, అవగాహన కల్పించేందుకు ప్రచారం చేసేందుకు ర్యాలీలు చేపడతామని వెల్లడించారు.

క్యాన్సర్‌ను అరికట్టడం ఎలాగో చిట్కాలను పంచుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం లాంటి విషయాల ప్రాముఖ్యతను ప్రజలు గ్రహించాలని ఆయన అన్నారు. ప్రాసెస్డ్‌, ప్యాకడ్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ క్యాన్సర్‌ రిస్క్‌ను పెంచుతాయి. వాటికి దూరంగా ఉండాలని డాక్టర్‌ సూచించారు. మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో దాదాపు 30 శాతం మంది ధుమపానం, ఆల్కహాల్‌ సేవన వల్ల వ్యాధి గ్రస్తులవుతున్నారని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement