Saturday, November 23, 2024

Delhi | మహిళా చట్టంతో మరోసారి మోసంగళమెత్తిన ఐద్వా-ఢిల్లీలో ధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చట్టసభల్లో రిజర్వేషన్ అంటూ మోదీ ప్రభుత్వం మహిళలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) విమర్శించింది. ఐద్వా ఆధ్వర్యంలో గురువారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిర్వహించిన చలో ఢిల్లీ ర్యాలీలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కదలివచ్చిన మహిళలు కేంద్రప్రభుత్వ విధానాలపై గళమెత్తారు. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సాగిన ప్రచారానికి ర్యాలీ ద్వారా ముగింపు పలికారు. ప్లకార్డులు పట్టుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీకే శ్రీమతి టీచర్, మరియం దావలే మాట్లాడుతూ 2014లో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, హింసకు ఎక్కువగా బాధితులవుతున్నది మహిళలేనని అభిప్రాయపడ్డారు. భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు ముప్పు పొంచి ఉందని, న్యూస్‌క్లిక్‌పై వేటే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement