పొద్దున బెడ్మీది నుంచి లేచింది మొదలు.. మళ్లీ బెడ్‌పైకి చేరేదాకా చాలామంది చాయ్ తాగడం ఒక అలవాటుగా మార్చుకుంటారు. రోజుకు దాదాపు అయిదారు చాయ్‌లు తాగందే వారికి ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. ఇక.. ఇంట్లో టీ పెట్టే విధానం అందరికీ తెలిసిందే కదా.. కానీ, ఓ వ్యక్తి మాత్రం చాయ్ తయారు చేయడానికి గొప్ప ఐడియా వేశాడు. ఒకే స్టవ్‌మీద డికాషన్, పాలు.. ఆ పక్కన కప్పు ఉండేలా ప్లాన్ చేశాడు. దాంతో పాటు ఒక్కో దానికి ఒక్కో లెవల్లో వేడి తగిలేలా మంట సెట్ చేశాడు.
దీంతో ముందు ఎక్కువగా హీట్ అయిన డికాషన్ బౌల్ నుంచి ఆ పక్కనే ఉన్న పాల పాత్రలోకి డికాషన్ ఒలికిపోతుంది.. ఇక ఆ పాల పాత్ర కూడా అప్పటికే వేడి కావడం, పాలు మరిగి ఉండడంతో అది నిండి దాని పక్కనే సెట్చేసిన కప్పులోకి ఒలికిపడుతుంది.. ఇంత క్రియేటివిటీ ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎవరు క్రియేట్ చేశారన్న వివరాలు లేవు కానీ, అతనికి విజ్ఞానానికి ఓ సెల్యూట్ కొట్టాల్సిందే.. ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి..
గమనిక: కొన్నిసార్లు వీడియోల లింక్ యాడ్ కావడం లేదు.. మీకు కనిపించకపోతే.. www.prabhanews.com వెబ్‌సైట్‌లోని వీడియో ట్యాబ్ క్లిక్ చేసి చూడొచ్చు..