నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
నాసిరకం విత్తనాలు అమ్మితే లైసెన్స్ లు రద్దు
సహకార రంగం ద్వారా ఎరువులు పంపిణి
అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
అమరావతి – ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనిలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు అవుతోంది.. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.. నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై చర్యలకు వెనుకాడొద్దని ఆదేశించారు. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్లో వేసే పంటలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఇక, వరి, మొక్కజొన్న, కందులు, పెసర్లు, పత్తి, చిరు ధాన్యాలు, ఉద్యాన పంటల రైతులకు అండగా నిలబడాలని సూచించారు సీఎం చంద్రబాబు.. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడుకు ఆదేశాలు జారీ చేశారు. భూసార పరీక్షలకు కేంద్రం రూ. 20 కోట్లు కేటాయించామని,. సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.. ఖరీఫ్ సీజన్లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలని సూచించిన ఆయన.. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు.