హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. దక్షిణ ఆస్ట్రేలియాలో 50 ఏళ్ల క్రితం ఏర్పాటైన ముర్దోక్ విశ్వవిద్యాలయంతో కలిసి పని చేసేందుకు అగ్రి వర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు సమక్షంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.సుధీర్ కుమార్, ముర్దోక్ విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ ఛైర్ రాజీవ్ వర్షిణి లు అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా బోధన, పరిశోధనా రంగాల్లో రెండు విశ్వవిద్యాలయాలు కలిసి పని చేయడానికి వీలు కలుగుతుంది. విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు పరస్పర మార్పిడికి అవకాశం లభిస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.