ఇటీవల కేంద్రప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకం పట్ల కొందరు యువకులు ఆందోళన చేపట్టిన నేప థ్యంలో వారికి మద్దతుగా విపక్షాలు ఆ పథకాన్ని అడ్డుకొని తీరుతామని,వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న రీతిలోనే అగ్నిపథ్‌ను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా మరోపక్క అగ్నిపథ్ ను అమలుచేసి తీరుతామని, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలేదని ప్రభుత్వం తరపున ఇటీవల సమావేశమైన త్రివిధ దళాధిపతులు విస్పష్టంగా ప్రకటించారు. దీనికి తోడు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోహల్ సాంకేతికత యువత మేళవింపుతో అగ్నిపథ్ పునీతమౌతుందని వ్యాఖ్యానించారు. ఒక అడుగు ముందు కేసి అగ్నిపథ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ను సైతం విడుద ల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అగ్నిపథ్ మీద నెలకొన్న అనుమానాల్ని నివృత్తి చేయడానికి ప్రభుత్వ వర్గాలు బాగానే కసరత్తు చేస్తున్నాయి. స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి తనదైన శైలిలో అగ్నిపథ్ మీద గల అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.కొత్త నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అసమంజసంగా తోచవచ్చు. తాత్కా లికంగా అసంతృప్తిగా అనిపించవచ్చు. కొంత బాధించవచ్చు కూడా. కానీ అంతమంగా అవి జాతి నిర్మాణానికి తోడ్పడతా యి. వాటి ఫలాలను దేశమంతా ఆస్వాదిస్తుంది.
సరికొత్త లక్ష్యాలను, కేవలం 17-18 సంవత్సరాల వయసు వచ్చేస రికే అగ్నిపథ్ రూపంలో యువత అవకాశం అందిపుచ్చు కోవడం వల్ల 4 సంవత్సరాల తర్వాత సుమారు ఇరవై లక్షల పైచిలుకు సొమ్ముతో సమాజంలో అగ్నివీరునిగా అడుగుపెడ తాడు. సంపాదనే కాకుండా దానితోపాటు క్రమశిక్షణ, పరిప క్వతతో కూడిన మనస్తత్వం అలవడడం వల్ల నిర్ణయాత్మక సామర్థ్యం పెరుగుతుంది. 4 సంవత్సరాల సర్వీసుకుగాను 10ం2 విద్యార్హత ఇవ్వడంతో పాటు వివిధ రక్షణ దళాల్లో ఉద్యోగం పొందుటకు 10% రిజర్వేషన్ కల్పించబడుతుంది. సంపాదించిన సొమ్ముకు తోడు బ్యాంక్ అందించే ఋణసౌకర్యం ద్వారా స్వశక్తితో ఏదేని వృత్తిని చేపట్టడమో లేక విద్యను కొనసాగించి మరో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. క్రమశిక్షణ, మనోధైర్యం, పరిపక్వత గల మనస్తత్వం వల్ల తీసుకునే నిర్ణయాల్లో వేగంతోపాటు, నిజాయితీ, కచ్చితత్వం కూడా అంతర్లీనంగా ఉంటుందనే దూరదృష్టితో కార్పొరేట్ సంస్థలు సైతం ఈ పథకాన్ని స్వాగతిస్తున్నాయి. అలాంటి యువత వల్ల కంపెనీల ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడం వల్ల అధిక లాభాలు సాధ్యమవుతాయని, భారత ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతుందని ఆర్థిక నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. అగ్నిపథ్ నియామకమనేది నిరంతరం జరిగే ప్రక్రియ కావడం వల్ల ఏటా నలభైవేల అగ్నివీరులు సమాజం లో వారిపట్ల స#హజంగానే గౌరవ మర్యాదలు పెరిగే ధోరణి క్రమంగా బలపడే అవకాశం ఉంది. సైనికులకు చెల్లించే జీతా లు, పెన్షన్లు ఆర్థికభారంగా భావించొద్దు. దేశరక్షణకు వారు చేస్తున్న సేవలను వెలకట్టలేం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.