Saturday, November 23, 2024

ఆ ఆరోప‌ణ‌ల‌పై నుండి దృష్టి మ‌ర‌ల్చేందుకే అగ్నిప‌థ్ ని ప్ర‌క‌టించారా-మంత్రి కేటీఆర్ ట్వీట్

శ్రీలంకలో భారత ప్రధాని నరేంద్ర మోడీ- ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతి బంధంపై వస్తున్న ఆరోపణలపై దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇచ్చేలా లంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై.. మోడీ ఒత్తిడి తెర్చారని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తన పదవికి రాజీనామా చేశారు. కానీ, ఈ వ్యాఖ్యలపై భారత్ లో విపక్షాలు మోదీపై భగ్గుమన్నాయి. అటు శ్రీలంకలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీని, ప్రధాని మోదీని కేటీఆర్ గతంలోనూ ప్రశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదంతో ముడిపెడుతూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement