Tuesday, November 26, 2024

సెన్సెక్స్‌ దూకుడు.. ఆల్‌ టైమ్‌ రికార్డ్‌కు చేరిన సూచీలు

అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడం, ప్రధాన కంపెనీల షేర్లు రాణించడంతో సోమవారం నాడు ట్రేడింగ్‌లో సూచీలు ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ స్థాయికి చేరుకున్నాయి. ఉదయం ప్రారంభంలో మార్కెట్లు ప్లాట్‌ గానే ప్రారంభమయ్యాయి. చివరకు లాభాల్లో ముగిశాయి. చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. చైనాలో కరొనా కేసులు పెరుగుతుండటంతో చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. దీంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఈ వార్తలతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 2 డాలర్లు తగ్గింది. ఇది మార్కెట్లకు కలిసి వచ్చింది.

సెన్సెక్స్‌ 211.16 పాయింట్లు లాభంతో 62504.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 18562.75 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 12 రూపాయలు తగ్గి 52532 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 56 రూపాయలు తగ్గి 61620 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.68 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

- Advertisement -

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, వి ప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీ ల్యాబ్స్‌, టెక్‌ మహీంద్రా, మారుతి సుజుకీ, ఐటీసీ, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, కోల్‌ ఇండియా, ఓఎన్జీసీ, అపోలో ఆస్పటల్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement