ప్రభన్యూస్ : వాంఖడే వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ పటిష్ఠ స్థితిలో ఉంది. తొలిరోజు ఆదిలో భారత్ తడబాటుకు గురైనా టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అజేయ శతకంతో ఆదుకున్నాడు. 80పరుగుల స్కోరు వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడిన టీమిండియాను మయాంక్ అగర్వాల్ 120 పరుగులతో సూపర్ సెంచరీ సాధించి గట్టెక్కించాడు. ఈనేపథ్యంలో తొలిరోజు టీమిండియా 4వికెట్లుకు 221పరుగులు నమోదు చేసింది. కాగా అంతా ఊహించినట్టుగానే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమై తొలిరోజు 70ఓవర్లు ఆట మాత్రమే కొనసాగింది. టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
రెండో టెస్టుకు రహానె, ఇషాంత్, జడేజా దూరమయ్యారు. న్యూజిలాండ్ వైపు ఈ మ్యాచ్‌కు కివీస్ సారథి కేన్ విలియమ్సన్ దూరం కావడంతో టామ్ లాథమ్ సారథిగా వ్యవహరించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్‌గిల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. సౌథీ కివీస్ బౌలింగ్ ప్రారంభించి తొలి ఓవర్ మెయిడిన్‌గా నమోదు చేశాడు. ఓపెనింగ్ జోడీ కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో 10ఓవర్లకు స్కోరు వికెట్ నష్టపోకుండా 29పరుగులు నమోదైంది. ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ 71బంతుల్లో 7ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44పరుగులు చేసి మయాంక్‌తో కలసి శుభారంభాన్ని అందించాడు. జోరు మీదున్న ఓపెనింగ్ జోడీని అజాజ్ పటేల్ విడదీశాడు. హాఫ్‌సెంచరీకి చేరువ అవుతున్న గిల్ అజాజ్ పటేల్ బౌలింగ్‌లో రాస్‌టేలర్‌కు క్యాచ్ ఇచ్చివెనుదిరిగాడు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్
మయాంక్ అగర్వాల్ (బ్యాటింగ్) 120, గిల్ (సి) రాస్‌టేలర్ (బి) అజాజ్ పటేల్ 44, పుజారా (బి) అజాజ్ పటేల్ 0, కోహ్లీ (ఎల్బీ) అజాజ్ పటేల్ 0, శ్రేయస్ అయ్యర్ (సి) టామ్ బ్లండెల్ (బి) అజాజ్ పటేల్ 18, సాహా (బ్యాటింగ్) 25. ఎక్స్‌ట్రాలు 14. మొత్తం: 221 (4వికెట్లు. 70ఓవర్లు). వికెట్ల పతనం: 80-1, 80-2, 80-3, 160-4. బౌలింగ్: టిమ్ సౌథీ 15-5-29-0, జెమీసన్ 9-2-30-0, అజాజ్ పటేల్ 29-10-73-4, సోమర్‌విలే 8-0-46-0, రచిన్ రవీంద్ర 4-0-20-0, మిచెల్ 5-3-9-0
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital