భారత్, ఆసిస్ మహిళా జట్ల మధ్య ఇవ్వాల (గురువారం) జరుగుతున్న ఫస్ట్ సెమీస్‌లో ఆసిస్ దూకుడుమీదుంది. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ మహిళల జట్టు జోష్ పెంచింది. అయితే.. భారత మహిళల జట్టు కూడా ఏమీ తీసిపోకుండా ఆడింది. కీలకమైన వికెట్లు తీసి ఆసిస్‌ను కట్టడి చేసింది. ఇక.. ఫస్ట్ సెమీస్‌లో ఆసిస్ 4వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కాగా, భారత మహిళల జట్టు టార్గెట్ 173 పరుగులుగా ఉంది.
ఇందులో.. ఆసిస్ జట్టుకు చెందిన హేలీ (25), మూనీ (54), గార్డినర్ (31), హార్రీస్ (7) పరుగులు చేయగా.. మెగ్ లాన్నింగ్ 49, ఎల్సీపెర్రీ 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.