Monday, November 18, 2024

Delhi | అగనంపూడి టోల్‌ప్లాజా తొలగిస్తాం.. ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి హామీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖ ప్రజలు, స్థానికుల పాలిట భారంగా మారిన అగనంపూడి టోల్ ప్లాజాను తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చారు. టోల్ ప్లాజా తొలగింపుపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. కేవలం ఈ ఏడాది కాలంలోనే హైవేలకు 50 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినందుకు కేంద్రానికి జీవీఎల్ ధన్యవాదాలు తెలిపారు.

విశాఖపట్నం సిటీ  పాత జాతీయ రహదారిపై  ఉన్న అగనంపుడి ప్లాజా వల స్థానికులపై కొన్నేళ్లుగా అధిక భారం పడుతోందని, సబ్బవరం-అనకాపల్లి మధ్య కొత్త జాతీయ రహదారిని ఇప్పటికే నిర్మించినప్పటికీ అగనంపూడి టోల్ ప్లాజా తీసివేయనందు వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని జీవీఎల్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి నిబంధనలను అనుసరించి కాంట్రాక్టర్‌కు టోల్ ప్లాజా మంజూరు చేసినట్టు నితిన్ గడ్కరీ తెలిపారు. నిబంధనలను అనుసరించి అతనికి ఉన్న కాలపరిమితి ముగియడానికి ముందే దాన్ని తొలగించినట్లయితే భారీ స్థాయిలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపించి స్థానికులపై పడే భారాన్ని తొలగిస్తామని గడ్కరీ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement