అహ్మదాబాద్‌లో భారీ వర్షం కారణంగా ఇవ్వాల (ఆదివారం) రాత్రి జరగాల్సిన మ్యాచ్ కు అంతరాయం కలిగింది. అయితే.. 9గంటల తర్వాత కాస్త వాన తగ్గడంతో అంపైర్లు, జట్టు ముఖ్యులు హార్దిక్ పాండ్యా, వేడ్, నేహ్రాతో కలిసి పిచ్‌తోపాటు అవుట్ ఫీల్డ్‌ని పరిశీలించారు. పిచ్‌పై కవర్లను తొలగించేందుకు అంతా రెడీ అయ్యారు.
ఇక టాస్ వేయొచ్చు అనుకునే సమయంలో మరోసారి 9.20 నిమిషాలకు వర్షం కుండపోతగా గుమ్మరించింది. దీంతో ఇవ్వాల మ్యాచ్ ఆడడం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. హుటా హుటిన తొలగించిన కవర్లను మళ్లీ పిచ్‌పై కప్పేశారు. ఇక స్టేడియానికి తరలివచ్చిన వారు వర్షంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వాన చినుకుల నుంచి కాపాడుకునేందుకు షెల్టర్ కోసం పరుగులు తీయడం కనిపించింది.