Thursday, September 19, 2024

IND vs SL | మ‌ళ్లీ మ‌న‌కు స్వ‌ల్ప‌ టార్గెటే..

శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ లో భాగంగా నేడు జ‌రుగుతున్న మూడో మ్యాచ్ లో శ్రీలంక బ్యాట‌ర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక… నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 248 సాధించింది.

అయితే, శ్రీలంక ఓపెన‌ర్లు పాతుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59) భార‌త బౌలర్ల‌ను ఉతికారేశారు. టాపార్డ‌ర్ బ్యాటర్లు చెల‌రేగడంతో శ్రీలంక జ‌ట్టు భారీ ప‌రుగులు సాధించింది.

ఇక భార‌త బౌలర్ల‌లో రియాన్ ప‌రాగ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా… మ‌హ్మ‌ద్ సిరాజ్, అక్ష‌ర్ ప‌టేల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, కుల్దీప్ యాద‌వ్ లు చెరో వికెట్ ద‌క్కించుకున్నారు. కాగా, 249 ప‌ర‌గులు టార్గెట్ తో టీమిండియా చేజింగ్ కు దిగ‌నుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement