శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడగా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయగా, రోహిత్ సేన వన్డే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ టూర్ అనంతరం టీమిండియా ఆటగాళ్లంతా స్వగ్రామాలకు వెళ్లిపోయారు. కాగా, ప్రస్తుతం భారత ఆటగాళ్లకు 42 రోజుల విశ్రాంతి లభించనుంది.
ఆ తర్వాత సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో టీమిండియా హోమ్ సీజన్ ప్రారంభం కానుంది. కాగా, బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు మ్యాచ్ ల టీ20ల సిరీస్ జరగనుండగా… బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రానుంది. ఆ తరువాత న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరగనుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో భాగంగా ఈ టెస్ట్ రెండు సిరీస్ లు సిరీస్‌ను గెలవడం భారత్‌కు చాలా ముఖ్యం. WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటానికి భారత్ ఈ సిరీస్‌ను గెలవాలి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 5 వరకు సొంత గడ్డపైనే ఆడనుంది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
టీమిండియా తదుపరి షెడ్యూల్..
- బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు
తొలి టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి 23, చెన్నై వేదికగా ఉదయం 9.30 గంటలకు
రెండో టెస్ట్: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1, కాన్పూర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు
తొలి టీ20: అక్టోబర్ 6, ధర్మశాల, రాత్రి 7 గంటలకు
రెండో టీ20: అక్టోబర్ 9, ఢిల్లీ, రాత్రి 7 గంటలకు
మూడో టీ20: అక్టోబర్ 12, హైదరాబాద్, రాత్రి 7 గంటలకు
- భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన
తొలి టెస్ట్: అక్టోబర్ 16-20, బెంగళూరు, ఉదయం 9.30 గంటలకు
రెండో టెస్ట్: అక్టోబర్24- 28, పుణే, ఉదయం 9.30 గంటలకు
మూడో టెస్ట్: నవంబర్ 1 నుంచి 5, ముంబై, ఉదయం 9.30 గంటలకు
- బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్ట్‌ల సిరీస్)
తొలి టెస్ట్: నవంబర్ 22-26, పెర్త్, ఉదయం 7.50 గంటలకు
రెండో టెస్ట్(పింక్ బాల్): డిసెంబర్ 6-10, అడిలైడ్, ఉదయం 9.30 గంటలకు
మూడో టెస్ట్: డిసెంబర్ 14-18, బ్రిస్బేన్, ఉదయం 5.50 గంటలకు
నాలుగో టెస్ట్: డిసెంబర్ 26-30, మెల్‌బోర్న్, ఉదయం 5.00 గంటలకు
ఐదో టెస్ట్: జనవరి 03-07, సిడ్నీ, ఉదయం 5.00 గంటలకు