Saturday, November 23, 2024

TS | పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. డబుల్ ఇంజిన్ సర్కార్ : బీజేపీ

హైదరాబాద్‌లోని హమారా సంకల్ప్ వికాసిత్ భారత్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ కార్యక్రమంలో భాగంగా హోటల్ కత్రియాలో ఏర్పాటు చేసిన అడ్వకేట్స్ మీట్‌కు డా.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది అని… ఎన్నికల ప్రక్రియ ద్వారానే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంద‌ని అని స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే ఇండియా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. ప్రజల మనోగతాన్ని తీసుకుని మ్యానిఫెస్టోలో తయారు చేయడానికి బీజేపీ సిద్ధం అయ్యిందని తెలిపారు. అందులో భాగంగానే ప్రజలు, మేధావులు, వెనుక బడిన వర్గాల సలహాలు తీసుకోవడానికి ముందుకు వచ్చామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement