Tuesday, November 26, 2024

ఎన్నికల తరువాతే పొత్తు.. సేన, టీఎంసీ మిత్రులే.. : చిదంబరం

గోవాలో ఒంటరిగానే పోటీ చేసేందుకు నిర్ణయించామని, పొత్తుల విషయంలో ఏ పార్టీతో సంప్రదించలేదని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే.. పోత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. శివసేన, ఎన్‌సీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించలేదని స్పష్టం చేశారు. ఇప్పటికి మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నామని, అయినంత మాత్రాన తమ మధ్య బేదాభిప్రాయాల్లేవని, మిత్రతం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల తరువాత వారితో కలిసే పని చేస్తామన్నారు. అయితే తృణమూల్‌పై మాత్రం చిదంబరం విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లేందుకు ఆహానించామని, అయితే తమ ఎమ్మెల్యేలలనే కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

తృణమూల్‌తో మాత్రం పొత్తు విషయంపై అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. స్థానిక పరిస్థితులు, వాస్తవాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకునే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. గోవా సీఎం అభ్యర్థి విషయంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, అయితే అభ్యర్థి ప్రకటన ఎన్నికల కంటే ముందు ఉంటుందా..? తరువాత ఉంటుందా..? అనేది పార్టీ నేతలతో చర్చించిన తరువాతే చెబుతానని స్పష్టం చేశారు. గోవాలో పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ఉంటుందని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement