ఈ ఏడాది టాలీవుడ్‌కి పెళ్లిళ్ల సీజన్‌గా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న బ్యాచిలర్స్ అందరూ పెళ్లి చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇటీవలే హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోగా.. వరుణ్ తేజ్ నిశ్చితార్థం కూడా కొన్ని రోజుల క్రితం జరిగింది. వరుణ్ తేజ్ తర్వాత మరో యంగ్ హీరో రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో కూడా రామ్ పెళ్లి గురించి పుకార్లు వచ్చాయి, అయితే అవన్నీ యువ హీరో ఖండించాడు. కానీ ఈసారి అది నిజమని చెప్పారు. వ్యాపారవేత్త కుమార్తెతో రామ్ పోతినేని వివాహం దాదాపు ఖరారైంది.. త్వరలో ప్రకటన ఉంటుంది. ఈ వార్త నిజమైతే రామ్ ఫ్యాన్స్ ఆనందపడడం ఖాయం.
శర్వానంద్ రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు.. జూన్ 4న జైపూర్‌లో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జూన్ 9న నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్‌లో రామ్ పోతినేని కూడా చేరడం దాదాపు ఖాయం.