కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లా కన్నూరులోని నెన్‌మేని గ్రామంలో ఆఫ్రికన్ స్వైన్ ప్లూ కేసు నమోదైంది. జిల్లాలో పశు సంవర్దక శాఖ అప్రమత్తమై పందుల వ్యాప్తి నిరోధించే కార్యక్రమం చేపట్టింది. గ్రామంలోకి కొత్తగా 193 పందులు వచ్చినట్లు పశు సంవర్దక శాఖ డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ రాజేష్ తెలిపారు.
వాయనాడ్ జిల్లాలోని 222 పందుల ఫామ్‌లలో 20 వేల పందులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బీహర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. పెంపుడు పందుల ద్వారా ఆఫ్రికన్ ఫీవర్ వైరస్ వ్యాప్తి చెందిందని వారు చెబుతున్నారు. తూర్పు ఆఫ్రికాలో మొట్ట మొదటి ఆఫ్రికన్ ఫీవర్ కేసు నమోదైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.