తాలిబన్ల కారణంగా ఆఫ్ఘనిస్థాన్ దేశం ప్రస్తుతం సతమతమవుతోంది. ఈ ప్రభావం ఆ దేశ క్రికెట్‌పైనా పడింది. పాకిస్థాన్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. సెప్టెంబర్ తొలి వారంలో శ్రీలంకలో ఈ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. దీంతో అక్కడి క్రికెట్ బోర్డు సిరీస్‌ను వాయిదా వేయాల్సిందిగా పీసీబీని కోరింది.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతోపాటు శ్రీలంకలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, ప్లేయర్స్ మానసిక సమస్యల కారణంగా సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పీసీబీ తెలిపింది. ఆఫ్ఘన్ క్రికెట్ టీమ్ రోడ్డు మార్గం ద్వారా పాకిస్థాన్ వెళ్లి అక్కడి నుంచి శ్రీలంకకు విమానంలో వెళ్లాలని ప్లాన్ చేసింది. అయితే పరిస్థితులు అందుకు కూడా అనుకూలంగా లేకపోవడంతో సిరీస్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసి.. 2022లో నిర్వహించే ప్లాన్ చేశారు.
ఈ వార్త కూడా చదవండి: నేటి నుంచి పారా ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం