భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్, సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఇక మిగిలినవి రెండు స్థానాలు కోసం నాలుగు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే పాయింట్స్ టేబుల్ లో 10 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా… సెమీస్ చేరాలని పట్టుదలగా ఉంది. వరుసగా ఐదు విజయాలు సాధించిన ఆసీస్ భలమైన ఆత్మవిశ్వాసంతో ఉంది. దీంతో రేపు ఆఫ్ఘానిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ లో గెలిచి సెమీస్‌లో తమ బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలని చూస్తోంది.
మరోవైపు ఆఫ్గానిస్తాన్ కూడా అదే జోరును కనబరుస్తోంది. ప్రస్తుతం 7 మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించింన ఆఫ్గాన్.. ఈ ప్రపంచకప్‌లో సెమీస్ చేరడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లకు షాక్ ఇచ్చిన అఫ్గాన్… రేపు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించి సెమీస్ చేరాలని పట్టుదలగా ఉంది.
అంచనా జట్లు..
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
ఆఫ్ఘానిస్తాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమ్రాజాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఫ్ఫజ్ ఉర్ రహ్మద్ , అబ్దుల్ రెహమాన్, నవీన్ ఉల్ హక్.