భారత్ తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆఫ్ఘానిస్థాన్ జట్టు సిద్ధమైంది. జనవరి 11 నుంచి 17 వరకు భారత్తో అఫ్గాన్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. అయితే, అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు తొలిసారి భారత పర్యటనకు రానుంది. 2018లో బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టు ఆడేందుకు వచ్చిన ఆఫ్ఘాన్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్తో భారత్ వేదికగా తలపడుతుండటం ఇదే తొలిసారి.
భారత్-అఫ్గాన్ షెడ్యూల్ వివరాలు..
తొలి టీ20 : జనవరి 11న ఐఎస్ బింద్రా స్టేడియం, మొహాలి
రెండో టీ20 : జనవరి 14న హోల్కర్ స్టేడియం, ఇండోర్
మూడో టీ20 : జనవరి 17న చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
అయితే, ఇప్పటివరకు భారత్, అఫ్గాన్లు ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే మ్యాచ్లలో పోటీపడటమే తప్ప.. నేరుగా తలపడింది లేదు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పెంచుకునేందుకు గాను ఈ సిరీస్ ఉపయోగపడుతుందని ఇరుదేశాల బోర్డు ప్రతినిధులు తెలిపారు.