Tuesday, November 26, 2024

ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా అలీ అహ్మద్ జలాలీ

ఆఫ్ఘనిస్థాని ఆక్రమించుకున్న తాలిబాన్లు ఆ దేశంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు క్లిష్టంగా మారాయి. గత కొన్నిరోజులుగా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిని చేజిక్కించుకుంటూ వస్తున్న తాలిబాన్లు ఇవాళ రాజధాని కాబూల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం అధికారాన్ని తాలిబాన్లకు అప్పగించింది. ఆఫ్ఘన్ తాత్కాలిక అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ నియమితులయ్యారు.కాగా, కాబూల్ లో శాంతిభద్రతలపై ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలను కోరారు. కాగా, అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆఫ్ఘన్ ను విడిచి తజకిస్థాన్ లో ఆశ్రయం పొందినట్టు ఆఫ్ఘన్ హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆఫ్ఘనిస్థాన్ లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement