అఫ్గానిస్థాన్ లో మరోసారి భూమి కంపించింది. ఇవాళ తెల్లవారుజామున 1.09 గంటలకు అఫ్గాన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.
భూ అంతర్భాగంలో 150 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. కాగా అఫ్గానిస్థాన్‌లో గత రెండు వారాల్లో భూకంపం రావడం ఇది నాలుగోసారి. భూకంపం రావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.