ఆసియాకప్ -2023లో భాగంగా ఇవ్వాల (మంగళవారం) లాహోర్ వేదికగా జరిగిన అఫ్గానిస్థాన్-శ్రీలంక ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ పోరాడి ఓడింది. సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించాలంటే 38.1 ఓవర్లలో 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, ఆఫ్ఘాన్ 37..4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయ్యింది..
ఫలితంగా 2 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక, బంగ్లాదేశ్‌తో కలిసి… గ్రూప్ బీ నుంచి సూపర్ 4 స్టేజీకి అర్హత సాధించింది.భారీ లక్ష్యఛేదనలో రెహ్మనుల్లా గుర్భాజ్ 4, ఇబ్రహీం జద్రాన్ 7 పరుగులు, గుల్బాదీన్ నయీబ్ 22 పరుగులు చేసి అవుట్ కావడంతో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్. ఈ దశలో రెహ్మత్ షా 40 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు, కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 66 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసి ఆఫ్ఘాన్‌ని ఆదుకున్నారు
ఫాస్టెస్ట్ వన్డే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంతకుముందు పాకిస్తాన్‌పై ముజీబ్ వుర్ రహీం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే, నబీ ఆ రికార్డుని బ్రేక్ చేశాడు..32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న మహ్మద్ నబీ, మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే అప్పటికి ఆఫ్ఘాన్, సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించాలంటే 61 బంతుల్లో 91 పరుగులు అవసరమయ్యాయి..13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు చేసిన కరీం జనత్, వెల్లలాగే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు
. అదే ఓవర్‌లో ఆఫ్ఘాన్ కెప్టెన్ షాహిదీని కూడా అవుట్ చేశాడు వెల్లలాగే. అయితే రషీద్ ఖాన్, నజీబుల్లా జద్రాన్ కలిసి బౌండరీలు బాదుతూ టీమ్‌ని లక్ష్యం వైపు నడిపించారు..ఆఫ్ఘాన్ సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించాలంటే 10 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన సమయంలో నజీబుల్లా అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన నజీబుల్లా, రంజిత బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..నజీబుల్లా అవుటైన తర్వాత 3 బంతుల్లో ఒక్క పరుగు అది కూడా ఎక్స్‌ట్రా రూపంలో వచ్చింది. ఆ తర్వాతి ఓవర్‌లో రషీద్ ఖాన్ 3 ఫోర్లు బాది 12 పరుగులు రాబట్టాడు. 38వ ఓవర్ మొదటి బంతికి ఆఫ్ఘాన్‌కి 3 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆ బంతికి ముజీబ్ భారీ షాట్‌కి ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..ఫజల్ హక్ ఫరూక్ 3 బంతులాడి ధనంజయ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడతో ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్‌కి తెరపడింది
. 16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన రషీద్ ఖాన్ నాటౌట్‌గా నిలిచాడు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేయగలిగింది..పథుమ్ నిశ్శంక 40 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేయగా దిముత్ కరుణరత్నే 35 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 63 పరుగులు జోడించారు. సదీర సమరవిక్రమ 3 పరుగులకే అవుట్ అయినా కుసాల్ మెండిస్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. సెంచరీకి 8 పరుగుల దూరంలో కుసాల్ మెండీస్ రనౌట్ అయ్యాడు..చరిత్ అసలంక 43 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేయగా ధనుంజయ డి సిల్వ 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేశాడు. కెప్టెన్ దస్సున్ శనక 5 పరుగులు చేసి అవుట్ కాగా దునిత్ వెల్లలాగే 39 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు మహీశ్ తీక్షణ 24 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేశారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 25+ స్కోర్లు చేశారు..ఆఫ్ఘాన్ బౌలర్ గుల్బాదిన్ నయీబ్ 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా రషీద్ ఖాన్‌కి 2 వికెట్లు దక్కాయి. ముజీబ్ వుర్ రహీమ్ ఓ వికెట్ తీశాడు