ఐపీఎల్ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో ఆఫ్గనిస్తాన్ స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తీసుకుంది. అయితే దీన్ని సదరు ఫ్రాంచైజీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. జేసన్ రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో రూ.2కోట్లకు దక్కించుకుంది. బయో బబుల్‌లో ఉండలేనంటూ మొత్తం టోర్నీ నుంచే తప్పుకున్నాడు. చాలా కాలంగా బయో బబుల్‌లో ఉంటున్నా అని, అందుకే ప్రస్తుతం తన కుటుంబంతో గడపాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.
రాయ్ భార్య ఇటీవల రెండోసారి ప్రసవించింది. 20 ఏళ్ల రహ్మానుల్లా గుర్బాజ్ 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఇప్పటి వరకు రహ్మానుల్లా గుర్బాజ్ పలు లీగుల్లో ఆడాడు. 18 టీ20లు ఆడి.. 29.5 సగటుతో 534 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 79 పరుగులు. 9 వన్డే మ్యాచుల్లో 53 సగటుతో 428 పరుగులు చేశాడు. 3 సెంచరీలు సాధించగా.. అత్యధిక స్కోర్ 127 పరుగులుగా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..