Friday, November 22, 2024

హోమ్ గార్డ్ తో ఎఫైర్ ? కిటికీకి కట్టేసి కొట్టిన కుటుంబ సభ్యులు

ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు చాలానే వెలుగుచూస్తున్నాయి. ఎంతోమంది మహిళలు, అలాగే మగవాళ్లు కూడా మోసపోతున్నారు. అయితే ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణంలో జరిగిన ఈ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హోంగార్డు తో సంబంధం పెట్టుకుందని అనుమానించిన కుటుంబ సభ్యులు ఆమెను కిటికీకి కట్టి ఆరుబయట కూర్చోబెట్టి కొట్టారు. వివరాల్లోకి వెళితే ఎల్బిఎస్ నగర్ కు చెందిన నరేష్ హోం గార్డ్ గా పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన మరో మహిళతో నరేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నరేష్ కుటుంబ సభ్యులకు ఓ అనుమానం వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఆదివారం ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో ఉన్నపలంగా పట్టుకున్నారు. అనంతరం మహిళను కట్టేసి కొట్టారు. నరేష్ కినాకు ఏ సంబంధం లేదని తన దగ్గర నుండి అతను కొంతమందికి డబ్బులు ఇప్పించారని ఆ డబ్బులు గురించి మాట్లాడడానికి ఇంటికి వచ్చానని ఆమె చెప్పింది. ఇక సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గొడవను సర్దుమణిగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement